కరోనా ఆస్పత్రిగా మారిన ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్…

దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 500 ఐసోలేషన్ రైల్వే కోచ్‌‌లను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీంతో సోమవారం నుంచి ఆనంద్ విహార్ రైల్వే ష్టేషన్ కేంద్రంగా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు..

కరోనా ఆస్పత్రిగా మారిన ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్...
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2020 | 12:29 PM

దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 500 ఐసోలేషన్ రైల్వే కోచ్‌‌లను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీంతో సోమవారం నుంచి ఆనంద్ విహార్ రైల్వే ష్టేషన్ కేంద్రంగా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధం చేశారు అధికారులు. దీంతో ఈ స్టేషన్‌ను కరోనా మహమ్మారి చికిత్సా కేంద్రంగా అధికారులు మార్చారు. కాగా ఇప్పటికే షాకూర్ బస్తీలో 54 కోచ్‌లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దీంతో ఆనంద్ విహార్ నుంచి నడవనున్న ఐదు రైళ్లు సోమవారం నుంచి పాత ఢిల్లీ స్టేసన్ నుంచి నడవనున్నాయి. కాగా ఆనంద్‌ విహార్ రైల్వే స్టేషన్‌లోని ఏడు ప్లాట్ ఫాంలలో ఐసోలేషన్ వార్డులు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే కోచ్‌లలో బాధితులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆక్సిజన్ సిలిండర్లు, దుప్పట్లు, వైద్య పరికరాలు, శానిటైజ్ చేసిన పడకలను సిద్ధం చేశారు. ఇక టాయిలెట్‌లను బాత్రూములుగా మార్చారు.

Read More: 

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి