జేసీ కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ

కడప జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కలిసేందుకు లోకేష్ అధికారులను అనుమతి కోరారు. ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనల కారణంగా వీలుకాదంటూ అనుమతిని నిరాకరించారు...

జేసీ కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 15, 2020 | 11:58 AM

Lokesh meet JC family : వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పరామర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వారి ఇంటికి వెళ్లిన ఆయన దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డితో సమావేశం అయ్యారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కడప జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కలిసేందుకు లోకేష్ అధికారులను అనుమతి కోరారు. ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనల కారణంగా వీలుకాదంటూ అనుమతిని నిరాకరించారు.