పుంజుకుంటున్న మార్కెట్లు..మే 17 త‌ర్వాత ఏమ‌వుతుంది ?

క‌రోనాతో పోరాడుతూనే ఆర్థికంగా దేశం పుంజుకోవ‌డ‌మే కేంద్రం ల‌క్ష్య‌మంటున్నారు నిపుణులు.

పుంజుకుంటున్న మార్కెట్లు..మే 17 త‌ర్వాత ఏమ‌వుతుంది ?
Follow us

|

Updated on: May 13, 2020 | 2:07 PM

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌సంగాన్ని ఆర్థిక నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. లాక్‌డౌన్‌4లో ఖ‌చ్చితంగా మ‌రిన్ని మిన‌హాయింపులు, వెసులుబాట్లు ఉంటాయంటున్నారు. అలాగే విదేశాల నుంచి దిగుమ‌తి అయ్యే వ‌స్తువులు కాకుండా దేశీయంగా త‌యార‌య్యే వ‌స్తువుల‌నే కొనాల‌ని పిలుపునిచ్చాకు కాబ‌ట్టి ఇది భార‌త ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తుంద‌ని అంటున్నారు. క‌రోనాతో పోరాడుతూనే ఆర్థికంగా దేశం పుంజుకోవ‌డ‌మే కేంద్రం ల‌క్ష్య‌మంటున్నారు. ఇదిలా ఉంటే, బుధ‌వారం ప్రారంభ‌మైన‌ దేశీయ మార్కెట్లు పుంజుకున్న‌ట్లుగా క‌నిపించింది.
లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌క‌ముందు మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా రికార్డ్ స్థాయిని తాకిన సెన్సెక్స్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన కొద్దిరోజుల‌కే కుప్ప‌కూలిపోయింది. అయితే, ఆ త‌ర్వాత కాస్తా కోలుకున్న‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఆ రేంజ్‌లో దూసుకెళ్ల‌లేక‌పోయాయి. అయితే, రూ. 20ల‌క్ష‌ల కోట్ల‌తో ఆత్మ‌నిర్బ‌ర్ అభియాన్ పేరుతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించిన కొత్త ఆర్థిక ప్యాకేజీ దేశీయ మార్కెట్లు భారీ లాభాల‌తో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.సెన్సెక్స్ 789 పాయింట్లు లాభ‌ప‌డి 31,160 పాయింట్ల వ‌ద్ద కొన‌సాగుతోంది. నిఫ్టీ225 పాయింట్లు లాభంతో 9,421 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. డాల‌రుతో పోలిస్తే రూపాయి మార‌కం విలువ రూ. 75.50 వ‌ద్ద ఉంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. దీన్ని బ‌ట్టి ప్ర‌దాని చేసిన ప్ర‌సంగం మార్కెట్ వ‌ర్గాల‌కు మంచి బూస్ట్‌లా ప‌నిచేసిందంటున్నారు నిపుణులు.

Latest Articles