భక్తులకు చేదు వార్త.. గుళ్లో దర్శనం దక్కినప్పటికీ.. వాటికి మాత్రం చెక్?

భక్తులకు చేదు వార్త.. గుళ్లో దర్శనం దక్కినప్పటికీ.. వాటికి మాత్రం చెక్?

సాధారణంగా గుడికి వెళ్తే.. దేవుడిని దర్శించుకున్నాక తీర్థం ఇచ్చి, శఠ గోపురం పెట్టి ప్రసాదాలు ఇస్తారు అర్చకులు. అవి తీసుకుంటే గానీ గుడికి వెళ్లొచ్చిన భావన ఉండదు. అయితే ఇప్పుడు వీటికి కూడా చెక్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నడిచేది కరోనా కాలం..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 13, 2020 | 1:32 PM

సాధారణంగా గుడికి వెళ్తే.. దేవుడిని దర్శించుకున్నాక తీర్థం ఇచ్చి, శఠ గోపురం పెట్టి ప్రసాదాలు ఇస్తారు అర్చకులు. అవి తీసుకుంటే గానీ గుడికి వెళ్లొచ్చిన భావన ఉండదు. అయితే ఇప్పుడు వీటికి కూడా చెక్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నడిచేది కరోనా కాలం కాబట్టి.. ఇక డైరెక్ట్‌గా దేవుడిని దర్శించుకుని వచ్చేటట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాలూ భక్తులకు దర్శనాలు కల్పించడం లేదు. దీంతో దాదాపు రెండు నెలలుగా దేవుడి దర్శనాలు కరువైపోయాయి. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కాశీ, తిరుమల, షిర్డీ, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు ఆలయ అధికారులు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ 3.0 ముగుస్తున్న నేపథ్యంలో ఆలయాల్లో భక్తులకు తిరిగి దర్శనాలు కల్పించే దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన ఆలయాలు తెరుచుకోనున్నాయి.

లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత దేవాలయాలు తెరిస్తే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆలయానికి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ భక్తులు పలు నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్చకులు ఇచ్చే తీర్థం, ప్రసాదం, శఠారీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై వారు తర్జనభర్జనలు పడుతున్నారట.

అందుకు కారణమేంటంటే.. కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి.. ఒకరిపై పెట్టిన శఠ గోపురం.. మరొకరి తలపై పెట్టడం, ఇలాగే తీర్థప్రసాదాలు పెట్టడం సురక్షితమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో దేవాదాయ శాఖ కూడా ఆలయ అధికారులు, అర్చకులతో చర్చలు జరుపుతోందట. సో దీనిపై తొందరలోనే ఓ క్లారిటీ రానుంది. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Read More:

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

అమెరికాలో కలకలం.. పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్.. 100 మంది పిల్లలు!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu