తెలంగాణలో కొత్తగా నమోదైన కరోనా కేసులు..పూర్తి వివరాలు..

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో క‌రోనా ఉధృతి త‌గ్గ‌డం లేదు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 1,473 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా నమోదైన కరోనా కేసులు..పూర్తి వివరాలు..

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో క‌రోనా ఉధృతి త‌గ్గ‌డం లేదు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 1,473 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 55,532కు చేరగా, ఇప్పటి వరకు కరోనాతో 471 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 42,106 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 12,955 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.85 శాతం కాగా, దేశ వ్యాప్తంగా ఆ రేటు 2.3 శాతంగా ఉంద‌ని అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 9,817మంది నమూనాలను పరీక్షించగా, 1,473 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,63,242 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్రతి 10 లక్షల జనాభాలో 245 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక జిల్లాల వారిగా చూసుకుంటే, గడిచిన రెండు రోజులుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో కేసుల సంఖ్య గ‌ణనీయంగా త‌గ్గుతున్నాయి. కానీ, అదే స‌మ‌యంలో జిల్లాల‌కు వైర‌స్ చాప‌కింద నీరులా విస్తరిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి- 506
రంగారెడ్డి జిల్లా – 168
వరంగల్‌ అర్బన్‌ – 111
సంగారెడ్డిల – 98
కరీంనగర్‌లో – 91
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి -86
నిజామాబాద్‌ -41
మహబూబాబాద్‌ -34
జోగులాంగ గద్వాలలో – 32
సూర్యాపేట -32
నల్లగొండ – 28
ఆదిలాబాద్‌ జిల్లా -28
ఖమ్మం -20
నాగర్‌కర్నూల్‌ -19
రాజన్న సిరిసిల్ల -19
జగిత్యాల- 18
కామారెడ్డి -17
మెదక్‌ -17
మంచిర్యాల -14
సిద్దిపేటలో 12
ములుగు- 12
యాదాద్రి జిల్లాలో 11
జనగామ- 10
భద్రాద్రి కొత్తగూడెం -10
భూపాలపల్లి -10
వనపర్తిలో -9
వరంగల్‌ రూరల్‌ -8
మహబూబ్‌నగర్‌ -8
నారాయణపేట -2
వికారాబాద్‌లో -2