AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 News: దేశంలో కరోనా గ్రాఫ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసా? వారం రోజుల వ్యవధిలోనే…

Covid-19 News Update: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజూ సరాసరిగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Covid-19 News: దేశంలో కరోనా గ్రాఫ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసా? వారం రోజుల వ్యవధిలోనే...
Covid 19
Janardhan Veluru
|

Updated on: Apr 12, 2021 | 4:23 PM

Share

Coronavirus News Update: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో నిత్యం సరాసరిగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే దేశంలో కొత్తగా 9 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆదివారంనాడు(ఏప్రిల్ 11) ప్రపంచంలో 6 లక్షల కొత్త కేసులు నిర్థారణ కాగా…వీటిలో మన దేశంలో నమోదైనవే 1.70 లక్షల కేసులు (అంటే 27 శాతం) కావడం భారత్‌లో కరోనా ఉధృతిని తేటతెల్లంచేస్తోంది. గత వారం ఏప్రిల్ 5 నుంచి 11 తేదీ వరకు దేశంలో కొత్తగా 9.37 లక్షల కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతకు మునుపటి వారంతో పోలిస్తే కొత్త కోవిడ్ కేసుల సంఖ్య 70 శాతం మేర పెరిగాయి.

దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య వారం రోజుల వ్యవధిలోనే 1.2 కోట్ల దిగువ నుంచి 1.3 కోట్ల ఎగువునకు చేరింది. వారం రోజుల్లో దేశంలో యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 5న దేశంలో యాక్టివ్ కేసులు 7.41లక్షలుగా ఉండగా…ఇది ఏప్రిల్ 11నాటికి 12 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల వ్యవధిలో యాక్టివ్ కేసులు దాదాపు 4.5 లక్షలు పెరిగాయి.

New Covid Centers

New Covid Centers

దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు సెప్టెంబర్ 17న 10.17 లక్షలుగా నమోదుకాగా…ఆ తర్వాత గత ఐదు మాసాలుగా కరోనా కేసుల ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ మొదలైన తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య దీన్ని అధిగమించి 12 లక్షలకు చేరింది. ఫిబ్రవరి రెండో వారంలో సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

దేశంలోనే అత్యధికంగా ఏప్రిల్ 11న మహారాష్ట్రలో 37 శాతం(63,000) కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, కేరళ, తమిళనాడులోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

ఇవి కూడా చదవండి…వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్కులు పెట్టుకుంటేనే కరోనా తీవ్రతను సమర్ధంగా అడ్డుకోగలం..అమెరికా పరిశోధనల్లో వెల్లడి

భారతీయులకు శుభవార్త.. దేశంలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్..