అరటి తోటలను దెబ్బతీస్తున్న కొవిడ్‌-19

మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన ప్రాణాంతక కరోనా మహమ్మారి.. పంటలనూ వదలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అరటి తోటలకు సోకి.. పంటను నాశనం చేస్తోంది.

అరటి తోటలను దెబ్బతీస్తున్న కొవిడ్‌-19
Follow us

|

Updated on: May 26, 2020 | 3:11 PM

మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన ప్రాణాంతక కరోనా మహమ్మారి.. పంటలనూ వదలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అరటి తోటలకు సోకి.. పంటను నాశనం చేస్తోంది. ట్రాపికల్‌ రేస్‌ 4 అనే ఈ వైరస్‌.. వరల్డ్‌ వైడ్‌గా 26 బిలియన్ల అరటి వ్యాపారాన్ని దెబ్బతీసింది. టీఆర్‌ 4 అనేది మొక్కల వ్యాధుల్లో అత్యంత వినాశకరమైనదని.. మొక్కల్లో దీన్ని కొవిడ్‌-19గా చెబుతున్నారు.

అయితే ట్రాపికల్‌ రేస్‌ 4 అనే వైరస్‌ను మొదట తైవాన్‌లో గుర్తించారు. అక్కడి నుంచి ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా నుంచి లాటిన్ అమెరికా వరకు చేరుకుంది. ఇది మొదట ఆకులపై దాడి చేసి.. కాండంను తొలిచేస్తుంది. ఆ తర్వాత తోటలను నిర్వీర్యం చేస్తోంది. ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు ఇప్పటివరకు సమర్థవంతమైన మందు లేదు.

ఇండియాలో బీహార్‌, యూపీ ఈ వైరస్‌కు కేంద్రాలుగా మారాయి. బీహార్‌లోని కతిహార్‌, పూర్నియా..యూపీలోని మహారాజ్‌గంజ్‌ హాట్‌స్పాట్స్‌గా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో టీఆర్‌ 4ను గుర్తించినట్లు ప్రకటించారు నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ బనానాస్ ఎన్‌ఆర్‌సీబీ డైరెక్టర్‌ ఉమ. అయితే టీఆర్‌ 4 దేశంలోకి ఎలా చొరబడిందో నిర్థారించలేకపోయిన శాస్త్రవేత్తలు.. కతిహార్‌లో పరిశోధనలు చేస్తున్నారు.

దాదాపు 9 నెలల క్రితం దేశంలోకి ప్రవేశించి ఉంటుందని ప్రకటించారు ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ హార్టీకల్చర్‌ సైన్సైస్‌ అధ్యక్షుడు కేఎల్‌ చద్దా. పంట దెబ్బతిన్న పొలాలను వదిలేసి.. ముందు ఒకటి రెండేళ్లు వరి ధాన్యాన్ని సాగుచేయాలని.. అప్పుడు వైరస్‌ చైన్‌ కట్‌ అవుతుందని తెలిపారు. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల సమిష్టి కృషితోనే వైరస్ కట్టడి సాధ్యమని అంటున్నారు.

మన దేశంలో సుమారు వంద రకాల అరటి సాగవుతుంది. ఏడాదికి 27 మిలియన్‌ టన్నుల అరటిని ఉత్పత్తి చేస్తూ.. ప్రపంచంలోనే అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశంగా నిలచింది. టీఆర్‌ 4 వైరస్‌కు ఇండియా హాట్‌స్పాట్‌గా మారడం ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..