AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ఒకే ఇంట్లో అయిదుగురికి కరోనా

లాక్ డౌన్ నిబంధనల సడలింపు కారణంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. గత మూడు, నాలుగు రోజులుగా ప్రతీ రోజుల దేశవ్యాప్తంగా ఆరువేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

బ్రేకింగ్: ఒకే ఇంట్లో అయిదుగురికి కరోనా
Rajesh Sharma
|

Updated on: May 26, 2020 | 3:31 PM

Share

Five persons in a family infected with Coronavirus in Hyderabad: లాక్ డౌన్ నిబంధనల సడలింపు కారణంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. గత మూడు, నాలుగు రోజులుగా ప్రతీ రోజుల దేశవ్యాప్తంగా ఆరువేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోను కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ప్రతీ రోజు 30, 40 కరోనా కొత్త కేసులు నమోదు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒకే ఇంట్లో అయిదుగురికి కరోనా వైరస్ సోకిన విషయం గ్రేటర్‌లో కలకలం రేపుతోంది.

గ్రేటర్ పరిధిలోని కొండాపూర్‌ రాఘవేంద్ర కాలనీలో నివాసముండే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అతని ఇంట్లోవారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్య, కొడుకు, కోడలు, బావమరిదులకు మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఒకే ఇంట్లో మొత్తం అయిదుగురికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు ధ‌ృవీకరించారు. వీరిలో సాఫ్ట్‌వేర్ భార్య వయసు 31 కాగా.. అతని కొడుకు మూడేళ్లు, కోడలు మూడున్నరేళ్ళ చిన్నారులు. బావమరిది వయస్సు 34.

ఈ కరోనా వైరస్ సోకిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబంలోని అయిదుగురిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నగర శివారుల్లోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాల్సిన అవసరం వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.