Covid 19:’కరోనా’పై ఉపాసన జాగ్రత్తలు.. పాటించడం మంచిదే..!

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 చారలు చాస్తోంది. ఇప్పటికే 60 దేశాలకు ఈ వైరస్ విస్తరించగా.. దీని బారిన పడి 3,117మంది మరణించారు. 90936 మంది ఈ వ్యాధితో యుద్ధం చేస్తున్నారు.

Covid 19:'కరోనా'పై ఉపాసన జాగ్రత్తలు.. పాటించడం మంచిదే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 03, 2020 | 1:18 PM

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 చారలు చాస్తోంది. ఇప్పటికే 60 దేశాలకు ఈ వైరస్ విస్తరించగా.. దీని బారిన పడి 3,117మంది మరణించారు. 90936 మంది ఈ వ్యాధితో యుద్ధం చేస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో తొలి కోవిడ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అవ్వగా.. ప్రస్తుతం అతడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో అతడికి చికిత్సను అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయంపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా.. వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ క్రమంలో ఉపాసన కొన్ని జాగ్రత్తలు కూడా తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1.జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి ఉంటే కరోనా సోకినట్లు. వెంటనే వారు వైద్యుడిని సంప్రదించండి. 2.ఈ వైరస్‌కు ఎలాంటి మందు లేదు. అందుకే వ్యాధి లక్షణాల్లో ఏది ఉన్నా.. వెంటనే ఆసుపత్రికి వెళ్లండి. 3.హోమియోపతిలో మందు ఉందని అంటున్నారు. కానీ ఇప్పటివరకు నిర్ధారణ అవ్వలేదు. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. మాస్కులు తప్పనిసరిగా వాడండి 4.మాంసాహారం తినడం వల్ల కరోనా సోకదు. మాంసాన్ని బాగా ఉడికించి తినండి 5.ఇంట్లో ఎవ్వరికైనా దగ్గు, జ్వరం ఉంటే బయటకు వెళ్లనీయకండి.