AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుట్‌పాత్‌పై 69 మంది క‌రోనా పేషెంట్లు

క‌రోనా విజృంభిస్తున్న‌ త‌రుణంలో ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ఎదుట చోటు చేసుకున్న సంఘ‌ట‌న అంద‌రిని షాక్‌కు గురి చేసింది. అక్క‌డి అధికారుల నిర్ల‌క్ష్యంపై ప్ర‌జ‌లు మండిప‌డ‌తున్నారు.

ఫుట్‌పాత్‌పై 69 మంది క‌రోనా పేషెంట్లు
Jyothi Gadda
|

Updated on: Apr 26, 2020 | 1:39 PM

Share
ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తోంది. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో లాక్‌డౌన్‌, క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కోవిడ్ భూతం కోర‌లు చాస్తోంది. ఛాన్స్ దొరికితే చాలు..ఎదురైన వారిపై ఎటాక్ చేస్తోంది. ఇటువంటి త‌రుణంలో ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ఎదుట చోటు చేసుకున్న సంఘ‌ట‌న అంద‌రిని షాక్‌కు గురి చేసింది. అక్క‌డి అధికారుల నిర్ల‌క్ష్యంపై ప్ర‌జ‌లు మండిప‌డ‌తున్నారు. వివ‌రాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎట్టావా జిల్లాలోని సాయ్ ఫాయ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అక్క‌డ ఏకంగా 69 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఆసుపత్రి బయట గంట పాటు నిలుచున్న ఘటన కలకలం రేపుతోంది. వైద్యులు – వైద్య సిబ్బంది తమను అడ్మిట్ చేసుకోకపోవడంతో 69 మంది కరోనా రోగులు ఉత్తరప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి గేట్ల వద్ద పడిగాపులు కాసిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఆసుపత్రి వెలుపల ఉన్న ఫుట్ పాత్ పై కనీసం ఒక గంట పాటు వారంతా వేచి చూసిన వైనం అధికారుల నిర్లక్షానికి అద్దం పడుతోందంటూ స్థానికుల‌తో  పాటు నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు.
కరోనా సోకిన 69 మందిని ఆగ్రా నుంచి ఓ బస్సులో ఎస్కార్ట్ టీంతోపాటు సాయ్ ఫాయ్ లోని యూపీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. ఆసుపత్రి గేటు వద్ద ఆ 69 మంది రోగులు కేవలం మొహానికి మాస్క్ మాత్రమే ధరించి పడిగాపులు కాశారు. ప్రొటెక్టివ్ గేర్స్ ధరించిన ఇద్దరు పోలీసులు కొంచెం దూరం నుంచి వారిని నియంత్రిస్తూ క‌నిపించారు. విష‌యం తెలుసుకున్న స్థానిక పోల‌ల‌సులు అక్కడకు చేరుకుని..ప‌రిస్థితి స‌మీక్షించారు. జ‌రిగిన దానిపై విచారించ‌గా… ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే… ఇలా జరిగిందని యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీసీ తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదని సరైన డాక్యుమెంట్లు లేనప్పటికీ అందరినీ అడ్మిట్ చేసుకున్నామని ఒక గంట ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ఆ గంట స‌మ‌యంలో క‌రోనా పాజిటివ్ పేషెంట్లు బయట ఉండడం…అక్కడ జనసంచారం జరగడంపై విమర్శలు వస్తున్నాయి.

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్