ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11న అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ పలుమార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 11వ తేదీన శనివారం వీడియో కాన్ఫరెన్స్..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 08, 2020 | 6:27 PM

ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11న అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ పలుమార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 11వ తేదీన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా? పొడిగిస్తే ఎన్ని రోజులు, కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని చెప్పిన లాక్‌డౌన్ గడువు ఈనెల 14తో ముగుస్తుంది. దీనికి మూడు రోజుల ముందు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

కాగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాన మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నివారణ, నియంత్రణ చర్యల మీద చర్చించారు. అయితే దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అంశాలను పరిశీలిస్తున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి లాక్‌డౌన్‌ను పొడిగించాలనే వారి నుంచి డిమాండ్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి: 

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి..

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే

రెహమాన్‌కు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మృతి

‘పాలు’ తాగాడని కన్న కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu