రెహమాన్‌కు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మృతి

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు తొలి అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంకే అర్జునన్ (87) మృతి చెందారు. సోమవారం తన ఇంట్లోనే అర్జునన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా నుంచి అనారోగ్యంగా ఉన్న..

రెహమాన్‌కు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 9:35 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు తొలి అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంకే అర్జునన్ (87) మృతి చెందారు. సోమవారం తన ఇంట్లోనే అర్జునన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా నుంచి అనారోగ్యంగా ఉన్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెహమాన్‌కు కీబోర్డ్ ప్లేయర్‌గా తొలి అవకాశం ఇచ్చిన వ్యక్తి అర్జునన్‌ కావడం గమనార్హం. అర్జునన్ మరణం పట్ల సినీ సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు. అర్జునన్ మరణం సినీ ఇండస్ట్రీకితీరని లోటు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.

1968లో కెరీర్‌లో ప్రారంభించారు అర్జునన్.. దాదాపు 50 సినిమాల్లో స్వరాలు సమకూర్చారు. 2017లో “భయానకం” సినిమాతో కేరళ రాష్ట్ర ఉత్తమ.. సంగీత దర్శకుడు అవార్డు అందుకున్నారు. ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు పాటల్ని ఎంతో అందంగా, నైపుణ్యంతో రికార్డ్ చేయడంలో అర్జునన్ దిట్ట. 2017లో అర్జునన్ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో రెహమాన్ అమెరికాకు వెళ్లి ఈవెంట్‌లో పాల్గొని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి:

‘పాలు’ తాగాడని కన్న కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కరోనా ‘మెడికల్ జ్యువెలరీ’.. వైరస్‌తో వ్యాపారమంటూ..

మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..

చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్

హైదరాబాద్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తొలి కరోనా కేసు

ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా