కరోనా వేళ.. పాక్‌లో ఆకలి కేకలు.. గర్భిణీ మృతి.!

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. దాయాది దేశం పాకిస్తాన్‌లో హృదయ విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా అక్కడ రోజూ వారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కరాచీలోని సింధ్‌ ప్రావిన్స్‌లో నివాసముంటున్న ఓ గర్భిణీ(30) ఆకలితో అలమటించి మూర్తి చెందినట్లు తెలుస్తోంది. Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ.. వివరాల్లోకి వెళ్తే.. మృతురాలి భర్త అల్లా బక్ష్ స్థానికంగా రోజూ వారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని […]

కరోనా వేళ.. పాక్‌లో ఆకలి కేకలు.. గర్భిణీ మృతి.!
Ravi Kiran

|

Apr 21, 2020 | 12:27 PM

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. దాయాది దేశం పాకిస్తాన్‌లో హృదయ విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా అక్కడ రోజూ వారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కరాచీలోని సింధ్‌ ప్రావిన్స్‌లో నివాసముంటున్న ఓ గర్భిణీ(30) ఆకలితో అలమటించి మూర్తి చెందినట్లు తెలుస్తోంది.

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

వివరాల్లోకి వెళ్తే.. మృతురాలి భర్త అల్లా బక్ష్ స్థానికంగా రోజూ వారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల అతనికి పనులు దొరకలేదు. దీనితో ఆరుగురు పిల్లలు ఉన్న కుటుంబం మొత్తం పస్తులు ఉంటున్నారు. దాని వల్ల ఆకలికి అలమిటించి తన భార్య మృతి చెందిందని అతడు వివరించాడు. అంతేకాకుండా చనిపోయిన తన భార్యను ఖననం చేయడానికి అతడి దగ్గర డబ్బులు లేకపోతే స్థానికులే ముందుకు వచ్చి విరాళాలు సేకరించి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారని తెలుస్తోంది. అయితే అక్కడ ప్రభుత్వానికి ఈ విషయం అసలు తెలియదని సమాచారం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారట. కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం పేదలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu