కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..

కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న వేళ.. కర్నూలులో వానరాల మృతి ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలగజేస్తోంది. ఏపీలో అత్యధికంగా కర్నూలు(158)లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఒక వైపు అయితే.. మరోవైపు పెద్ద సంఖ్యలో కోతులు మరణిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్.. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని గడివేములలో […]

కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 6:15 PM

కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న వేళ.. కర్నూలులో వానరాల మృతి ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలగజేస్తోంది. ఏపీలో అత్యధికంగా కర్నూలు(158)లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఒక వైపు అయితే.. మరోవైపు పెద్ద సంఖ్యలో కోతులు మరణిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్..

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని గడివేములలో తాజాగా 20కి పైగా కోతులు మరణించాయి. మరికొన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ఇలా కోతులు మృతి చెందటం.. అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా కరోనా వైరస్ వల్లే కోతులు మరణించాయని వదంతులు కూడా వ్యాపించాయి. దీనితో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం, నందికోట్కూరు పశు వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కోతుల కళేబరాలకు పోస్టుమార్టమ్ నిర్వహించారు. కరోనా వల్ల కోతులు చనిపోలేదని.. ఆహారం లేక ఆకలితో అలమటించి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమతం కావడం.. అంతేకాక వేసవిలో నీరు, పండ్లు లేకపోవడంతో కోతులకు ఆహారం దొరకట్లేదు. దాని వల్లే అవి ఆకలి, దప్పకిలకు తాళలేక చనిపోతున్నాయని పశు వైద్యాధికారులు చెప్పారు. కాగా, కరోనా వల్ల కోతులు చావలేదని తెలయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకుని వాటికి ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఇక గతంలో కర్నూలు జిల్లాలోనే కాకులు మరణించిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read:గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..