చెన్నై నుంచి శ్రీకాకుళం చేరుకున్న మత్స్యకారులు
లాక్‌డౌన్ కష్టకాలంలో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. దీంతో సొంతవారిని చేరుకోవాలనే ఆరాటంతో ఇతర ప్రాంతాల్లో ఇరుక్కుపోయినవారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

లాక్‌డౌన్ కష్టకాలంలో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. దీంతో సొంతవారిని చేరుకోవాలనే ఆరాటంతో ఇతర ప్రాంతాల్లో ఇరుక్కుపోయినవారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చేందిన కొందరు మత్స్యకారులు అత్యంత సాహాసం చేసి తమవారిని చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే…
చెన్నైలో చేపలవేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. 27 మంది మత్స్యకారులు ఇచ్ఛాపురం డొంకూరు తీర ప్రాంతానికి చెన్నై నుంచి బోటు ద్వారా చేరారు. వీరిలో పది మంది ఒడిషా వాసులు కూడా ఉన్నారు. ఒకరు శ్రీకాకుళం జిల్లా జగపతివాణిపేట తీర ప్రాంతానికి చెందినవారు. మిగతా 16 మంది డొంకూరుకు చెందిన వారు. వీరి రాకకోసం గత రెండు రోజులుగా పోలీసులు డొంకూరు తీర ప్రాంతం దగ్గర పహారా కాశారు. తీర ప్రాంతానికి చేరుకున్న వీరిని ఇచ్ఛాపురం దగ్గరలో ఉన్న పురుషోత్తమపురం గ్రామంలో ఉన్న క్వారంటైన్‌కు తరలించారు. చెన్నై నుంచి స్వగ్రామానికి రావడానికి బోటు సౌకర్యం లేకపోవడంతో లక్షా 70 వేల రూపాయలతో కొత్త బోటును కొన్నారు. ఆ బోటులోనే డొంకూరుకు వచ్చారు.




