కరోనా అలెర్ట్: గాలిలో వైరస్ వ్యాప్తి.. దగ్గితే 2 మీటర్లు.. తుమ్మితే 8 మీటర్లు..
కోవిడ్-19 ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. భారత్‌ను కూడా గడగడలాడిస్తున్న ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం, సామాజిక దూరం వంటి నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇక కరోనా సోకిన వ్యక్తి నుంచి బహిరంగ ప్రదేశాల్లో వైరస్ గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తుండనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అర్ధమయ్యేలా ఓ ట్వీట్ ద్వారా వివరించింది. Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు.. కరోనా సోకిన […]

కోవిడ్-19 ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. భారత్‌ను కూడా గడగడలాడిస్తున్న ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం, సామాజిక దూరం వంటి నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇక కరోనా సోకిన వ్యక్తి నుంచి బహిరంగ ప్రదేశాల్లో వైరస్ గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తుండనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అర్ధమయ్యేలా ఓ ట్వీట్ ద్వారా వివరించింది.
Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..
కరోనా సోకిన వ్యక్తి నిశ్వాసంలో ఉన్నప్పుడు అతని నుంచి 1.5 మీటర్లు వైరస్ ప్రయాణిస్తుంది. అదే ఆ వ్యక్తి దగ్గినప్పుడు రెండు మీటర్లు, తుమ్మినప్పుడు ఏకంగా ఎనిమిది మీటర్ల దూరం వరకూ వైరస్ గాలిలో ప్రయాణిస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 722 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ బారిన పడి 20 మంది మృతి చెందారు.
Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..
బహిరంగ ప్రదేశాల్లలో ఏ మేరకు గాలి లో వైరస్ ప్రయాణిస్తుంది? #APFightsCorona pic.twitter.com/1kQn50xNZu
— ArogyaAndhra (@ArogyaAndhra) April 20, 2020
