ఆయుష్మాన్ భారత్ ఉద్యోగికి కరోనా… బిల్డింగ్ సీల్
భారత్‌లో బుసలు కొడుతున్న కరోనా రాజ్‌భవన్‌ను కూడా వణికిస్తోంది. ఆఖరుకు ఆయుష్మాన్ భారత్..

ఆయుష్మాన్ భారత్
కోవిడ్-19 భూతం ఎవ్వరినీ వదలటం లేదు. ఆడమగ అనే తేడా లేదు, చిన్నాపెద్ద తారతమ్యం లేదు. పసిపిల్లలు మొదలు పండుముదుసలి వరకు అందరినీ పట్టి పీడిస్తోంది. భారత్‌లో బుసలు కొడుతున్న కరోనా రాజ్‌భవన్‌ను కూడా వణికిస్తోంది. ఆఖరుకు ఆయుష్మాన్ భారత్ ఉద్యోగులను వెంబడిస్తోంది. తాజాగా ఆయుష్మాన్ భారత్‌లో ఓ ఉద్యోగికి కోవిడ్ వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది.
ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాయలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి టెస్ట్‌లు చేయించగా అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ బిల్డింగ్‌ను సీల్ చేశారు. అక్కడ పనిచేస్తున్న 25మంది ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. వైరస్ ఎట్నుంచి దాడి చేస్తుందో తెలియక మిగితా సిబ్బంది హడలెత్తిపోతున్నారు.




