Breaking: ఐపీఎల్ నిరవధిక వాయిదా.. బీసీసీఐ అధికారిక ప్రకటన..
అంతా అనుకున్నట్లే జరిగింది. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడం, లాక్ డౌన్ మరిన్ని రోజుల పాటు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని.. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత.. అప్పటి పరిస్థితులు బట్టి టోర్నీ నిర్వహణపై చర్చిస్తామని బీసీసీఐ తెలిపింది. కాగా, మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ – […]

అంతా అనుకున్నట్లే జరిగింది. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడం, లాక్ డౌన్ మరిన్ని రోజుల పాటు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని.. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత.. అప్పటి పరిస్థితులు బట్టి టోర్నీ నిర్వహణపై చర్చిస్తామని బీసీసీఐ తెలిపింది.
కాగా, మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ – 13 దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడింది. అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు రెండో దశ లాక్ డౌన్ విధించడం జరిగింది. దీనితో ఐపీఎల్ ఇక ఈ ఏడాది లేనట్లేనని చెప్పాలి. ఈ నిరవధిక వాయిదా వల్ల బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీలు, ప్లేయర్లు, వాణిజ్య ప్రసార హక్కుదారులు, ఇతరత్రా స్పాన్సర్స్ అందరూ కూడా భారీ నష్టాలు చవి చూడాల్సిందే.
Indian Premier League 2020 season has now been postponed indefinitely: BCCI Official pic.twitter.com/5kWlfHCh54
— ANI (@ANI) April 15, 2020