AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రి నుంచి 70 మంది కరోనా పేషెంట్స్ పరార్

దేశ వాణిజ్య రాజధాని ముంబై కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతోంది. మరోవైపు కరోనా వైరస్ బాధితులకు ట్రీట్‌మెంట్ అందించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఓ ఆస్పత్రికి చెందిన వార్డ్‌లో 70 మంది కరోనా పేషెంట్లు పారిపోవడం కలకలం రేపుతోంది.

ఆస్పత్రి నుంచి 70 మంది కరోనా పేషెంట్స్ పరార్
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2020 | 7:17 PM

Share

దేశ వాణిజ్య రాజధాని ముంబై కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతోంది. మరోవైపు కరోనా వైరస్ బాధితులకు ట్రీట్‌మెంట్ అందించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు కూడా మహా సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ సోకిన బాధితుల్ని పశువుల కంటే హీనంగా చూడడం దారుణమంటూ ధర్మాసనం గతంలోనే మండిపడింది. ఇటువంటి తరుణంలో ముంబైలో మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రికి చెందిన వార్డ్‌లో 70 మంది కరోనా పేషెంట్లు పారిపోవడం కలకలం రేపుతోంది.

ముంబైలోని మలాద్ ప్రాంతంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే బృహన్ ముంబై కార్పొరేషన్ (బిఎంసి) రికార్డుల్లో వివరాలను అధికారులు చెక్ చేయగా… అందులో సుమారు 70 మంది బాధితులు అదృశ్యమైనట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన బృహన్ ముంబై మున్సిపాలిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో ఆ ఆస్పత్రికి చెందిన సి ఉ నార్త్ వార్డ్ నుంచి తప్పించుకున్న 70 మంది బాధితుల వివరాల్ని పోలీసులు సేకరించారు. అయితే ఆస్పత్రిలో దొరికిన వివరాల ఆధారంగా బాధితుల ఇళ్లకు వెళ్లగా అడ్రస్‌లు లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వారిని గుర్తించటం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో ఐఎంఈఐ నెంబర్ ద్వారా బాధితుల వివరాల్ని సేకరిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు