AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadala Movie Review: ‘వదలా’ సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయ కాంబినేషన్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?

చాలా రోజుల తర్వాత సీనియర్ నటుడు జగపతిబాబు హీరోగా నటించిన సినిమా వదల. లయ ఇందులో హీరోయిన్ గా నటించారు. చాలా రోజుల తర్వాత సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన సినిమా ఇది. మరి వదల ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Vadala Movie Review: 'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయ కాంబినేషన్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
Vadala Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 9:37 PM

Share

మూవీ రివ్యూ: వదలా

నటీనటులు: జగపతిబాబు, లయ, హ్రితిక శ్రీనివాస్, శ్రీనివాస్ అవసరాల తదితరులు

సినిమాటోగ్రఫీ: చోటా కే నాయుడు

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు

సంగీతం: కార్తిక్ బి కొడకండ్ల

నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరు మామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్

దర్శకుడు: ఆకెళ్ల వి కృష్ణ

కథ:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వైద్య వృత్తిలో ఉన్న యోగి సిద్ధార్థ్ (జగపతి బాబు), తన ఇల్లాలు ప్రియ (లయ), బిడ్డలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తుంటాడు. అంతా ఆనందంగా సాగుతున్న సమయంలో, ఓ ప్రమాదం కారణంగా అముద (హ్రితిక శ్రీనివాస్) అనే యువతి వారి కుటుంబానికి దగ్గరవుతుంది. ఆమె రాకతో వాళ్ల ప్రశాంత జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ ఆ అమ్మాయి నేపథ్యం ఏమిటి? వారి జీవితాల్లోకి ఆమె ఎందుకు అడుగుపెట్టింది? ఆమెకూ, నివాస్ (శ్రీనివాస్ అవసరాల) అనే వ్యక్తికీ ఉన్న సంబంధం ఏమిటి? అన్న ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

కథనం:

సినిమా మొదలైన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఉత్కంఠను దర్శకుడు చాలా నేర్పుగా నడిపించాడు. ముఖ్యంగా యోగి, అముద మధ్య వచ్చే సన్నివేశాలు మానవ సంబంధాలలోని సున్నితమైన కోణాలను, ఎవరూ ఊహించని భావోద్వేగాలను లోతుగా ఆవిష్కరించాయి. మొదటి భాగంలో భార్యాభర్తల మధ్య చూపించిన ప్రేమ సన్నివేశాలు వారి మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని, అన్యోన్యతను అందంగా తెలియజేస్తాయి. అలాగే మధ్యలో వచ్చే ఒక పాటను కూడా కథా గమనానికి తగినట్లుగా చిత్రీకరించారు. ఒక మానసిక సమస్యతో బాధపడే వ్యక్తి వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఉత్కంఠభరితంగా చూపిస్తూనే, క్లైమాక్స్‌కు వచ్చేసరికి కథను పూర్తిగా ఎమోషనల్‌గా మలుపు తిప్పారు. ఆ యువతి అంత గందరగోళం సృష్టించినా, చివరలో ఆమెను క్షమించి ఆమె జ్ఞాపకాలను సైతం ఆ కుటుంబం స్వీకరించే విధానం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. మానవత్వం, క్షమాగుణం ఎంత గొప్పవో ఈ కథనం ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నాడు. ఈ పాయింట్ అందరికీ నచ్చకపోవచ్చు కానీ విభిన్న సినిమాలు చూడాలి అనుకున్న వాళ్లకు మాత్రం ఓకే అనిపిస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా మొదలైన వదల చివరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. చెప్పాలి అనుకున్న కథ బాగానే ఉన్నా కూడా చెప్పిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. కేవలం గంటా 44 నిమిషాల డ్యూరేషన్ ఉండడం ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. క్యారెక్టర్ పరిచయాల కోసం కూడా ఎక్కువ టైం తీసుకున్నాడు దర్శకుడు. అక్కడక్కడ కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నాయి.

నటీనటులు:

పాత్రల విషయానికి వస్తే, కుటుంబం కోసం తపించే తండ్రిగా, బాధ్యతాయుతమైన వైద్యుడిగా జగపతిబాబు తన సీనియారిటీ చూపించారు. ఆయన భార్యగా నటించిన లయ, సినిమా ఆరంభంలో చాలా సహజంగా కనిపిస్తూనే, ముగింపు సన్నివేశాల్లో తన భర్తను కాపాడుకునే క్రమంలో భావోద్వేగాలను పండించింది. హృతిక శ్రీనివాస్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. మానసిక సంఘర్షణ అనుభవించే యువతిగా ఆమె తన ప్రతిభను కనబరిచింది. అందంతో పాటు అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది. శ్రీనివాస్ అవసరాల, రవివర్మ తదితరులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథకు బలాన్నిచ్చారు.

టెక్నికల్ టీం:

కార్తీక్ బి కొడకండ్ల అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. చోటా కే నాయుడు కెమెరా పనితనం ఓకే. ఎడిటింగ్ కూడా పర్లేదు. వదలా చిత్ర నిర్మాణ విలువల పట్ల నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆకెళ్ల వి కృష్ణ అత్యంత సున్నితమైన పాయింట్‌ను తీసుకున్నాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా వదలా.. కొంచెం థ్రిల్.. కొంచెం డల్..!

Follow Us
'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయల మూవీ ఎలా ఉందంటే?
'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయల మూవీ ఎలా ఉందంటే?
చిన్న పిల్లలకు నీరు ఎప్పటి నుండి తాగించాలి? చేయకూడని తప్పులివే!
చిన్న పిల్లలకు నీరు ఎప్పటి నుండి తాగించాలి? చేయకూడని తప్పులివే!
కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..
కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..
ఈ 5 బ్లూటూత్ డివైజ్‌లతో వృద్ధుల జీవితాలు సులభతరం
ఈ 5 బ్లూటూత్ డివైజ్‌లతో వృద్ధుల జీవితాలు సులభతరం
సైలెంట్‌గా షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. ఆ పాపులర్‌ ప్లాన్‌ తొలగింపు..
సైలెంట్‌గా షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. ఆ పాపులర్‌ ప్లాన్‌ తొలగింపు..
మిగిలిపోయిన చిన్న సబ్బు ముక్కలను పారేస్తున్నారా?ఈ స్మార్ట్ ట్రిక్
మిగిలిపోయిన చిన్న సబ్బు ముక్కలను పారేస్తున్నారా?ఈ స్మార్ట్ ట్రిక్
పిడుగుపడి ప్రపంచ ప్రముఖుడు మరణిస్తాడు.. 2026పై నోస్ట్రాడమస్..
పిడుగుపడి ప్రపంచ ప్రముఖుడు మరణిస్తాడు.. 2026పై నోస్ట్రాడమస్..
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సరికొత్త 'Ai+ నోవావాచ్'
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సరికొత్త 'Ai+ నోవావాచ్'
వర్షాకాలంలో మీ ఫ్రిజ్‌ టెంపరేచర్ ఎంతలో ఉంచాలో తెలుసా!
వర్షాకాలంలో మీ ఫ్రిజ్‌ టెంపరేచర్ ఎంతలో ఉంచాలో తెలుసా!
హీరో క్యూబో నుంచి అదిరిపోయే స్మార్ట్ డ్యాష్‌క్యామ్.. వివరాలివే
హీరో క్యూబో నుంచి అదిరిపోయే స్మార్ట్ డ్యాష్‌క్యామ్.. వివరాలివే