వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..
దేశమంతా కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపధ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు వలస కార్మికులకు ఊరటను ఇచ్చేలా ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షల మంది వలస కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న వలస కార్మికులు స్థానికంగా తమ పేర్లను నమోదు […]

దేశమంతా కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపధ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు వలస కార్మికులకు ఊరటను ఇచ్చేలా ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షల మంది వలస కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న వలస కార్మికులు స్థానికంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని.. వారికి ఉపాధి హమీలాంటి పనులను కల్పించాలని రాష్ట్రాలకు తెలిపింది.
అంతేకాకుండా వలస కూలీలు తమ సొంత గ్రామాలకు, పని దొరికే ప్రాంతాలకు వెళ్తానంటే పంపించవచ్చని.. అయితే అది కూడా కరోనా పరీక్షలు చేసి.. వైరస్ లేదని నిర్ధారణ అయిన తర్వాతే పంపాలని కేంద్రం సూచించింది. మరోవైపు వలస కార్మికులను ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు తరలించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అటు సొంత గ్రామాలకు వెళ్ళేవారు సామాజిక దూరాన్ని పాటిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాగా, వలస కార్మికులు ప్రయాణాలు చేసే సమయంలో స్థానిక యంత్రాంగం వారికి ఆహారం, నీరు లాంటివి అందించాలి.
Also Read:
లాక్‌డౌన్ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..
కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?
చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత
మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..
ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..
