మొదటి స్థానంలో కేరళ.. భారత్‌లో మొత్తం పాజిటివ్‌ కేసులు ఎన్నంటే..!

దేశంలో కరోనా విస్తరణ గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటికే 27 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వైరస్ విస్తరించింది. తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 840కు పైనే చేరింది.

మొదటి స్థానంలో కేరళ.. భారత్‌లో మొత్తం పాజిటివ్‌ కేసులు ఎన్నంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 27, 2020 | 8:25 PM

దేశంలో కరోనా విస్తరణ గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటికే 27 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వైరస్ విస్తరించింది. తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 840కు పైనే చేరింది. అలాగే 17మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఈ ఒక్క రోజే 39 కేసులు నమోదు కాగా.. నిన్నటివరకు టాప్‌లో ఉన్న మహారాష్ట్రను వెనక్కి నెట్టేసింది కేరళ. తాజా సమాచారం ప్రకారం కేరళ- 176, మహారాష్ట్ర-157, కర్ణాటక- 64, తెలంగాణ-59, గుజరాత్-43, రాజస్థాన్-43, యూపీ-43, తమిళనాడు-26, ఢిల్లీ-39, పంజాబ్-33, మధ్యప్రదేశ్‌-20, ఏపీ-13, జమ్ముకశ్మీర్-18, లడాక్-13, హర్యానా-21, హిమాచల్‌ప్రదేశ్-4, పశ్చిమ బెంగాల్-10, ఛండీగర్-7, ఛత్తీస్‌ఘడ్‌-3, పుదుచ్చేరి -1, మిజోరం- 1, మణిపూర్‌-1, గోవా-3 కేసులు ఉన్నాయి.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్ః కాంట్రాక్టర్ నిర్వాకం.. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్..!