కరోనా ఎఫెక్ట్ః కాంట్రాక్టర్ నిర్వాకం.. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్..!

దేశంలో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా బాధితుల సంఖ్యతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లాక్ డౌన్ ను ప్రకటించడంతో పాటు..

కరోనా ఎఫెక్ట్ః కాంట్రాక్టర్ నిర్వాకం.. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్..!
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 7:17 PM

దేశంలో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా బాధితుల సంఖ్యతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లాక్ డౌన్ ను ప్రకటించడంతో పాటు.. దాన్ని అమలు చేసే క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు తమ సరిహద్దులను బ్లాక్ చేశాయి. ముఖ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఏపీలోకి అనుమతించడం లేదు. వారిని క్వారంటైన్  సెంటర్లకు పంపుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ, కర్ణాటక సరిహద్దులల్లో ఉద్రిక్తత నెలకొంది. ఏపీకి చెందిన 1500 మంది మత్స్య కార్మికులు సరిహద్దుల్లో నిరీక్షణ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగుళూరు పోర్టు వద్ద సముద్రంలో చేపలు పట్టేందుకు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 1,500 మంది మత్స్య కార్మికులను ఓ కాంట్రాక్టర్ తీసుకెళ్లాడు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీకి చెందిన కార్మికులను సరిహద్దుల్లో వదిలివేసి వెళ్లాడు ఆ కాంట్రాక్టర్. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా కెలక్టర్, ఎస్పీ.. గంగవరం మండలం పెద్ద ఉగిని గ్రామం సమీపంలోని టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో వారు మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ లోకి రావాలంటే వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ టెస్ట్ లు తప్పనిసరని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో మత్స్యకారులు, అధికారులు మధ్య వాగ్వాదం నెలకొంది.

Read This Story Also: క్వారంటైన్‌ నుంచి జంప్‌.. ఎందుకు వెళ్లాడు..? ఎక్కడ దొరికాడో తెలుసా..!

Latest Articles
ఈ అందాల చందమామకు అవకాశాలు మాత్రమే అందని ద్రాక్షే..
ఈ అందాల చందమామకు అవకాశాలు మాత్రమే అందని ద్రాక్షే..
'ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక'.. మాజీ మంత్రి
'ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక'.. మాజీ మంత్రి
వేసవిలో మట్టి కుండలో నీళ్లు చల్లగా మారాలంటే.. ఇలా చేసి చూడండి!
వేసవిలో మట్టి కుండలో నీళ్లు చల్లగా మారాలంటే.. ఇలా చేసి చూడండి!
‘లైన్‌ మ్యాన్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడో తెల్సా..?
‘లైన్‌ మ్యాన్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడో తెల్సా..?
బాక్స్‌ క్రికెట్‌.. ఇప్పుడిది ట్రెండీ బిజినెస్‌
బాక్స్‌ క్రికెట్‌.. ఇప్పుడిది ట్రెండీ బిజినెస్‌
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..