ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పుకు దూరంగా ఉండాలి. మితంగా తీసుకోకపోతే బోలు ఎముల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక సోడా కూడా ఎక్కువగా తీసుకోకూడదు. నిత్యం సోడా తీసుకునే వారిలో కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎముకల సాంధ్రత కూడా తగ్గుతుంది.
ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో చక్కెర కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కెఫిన్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నా ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి.
ఇక బంగాళదుంప, మిరియాలు మోతాదుకు మించి తీసుకున్నా ఎముకల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలే దీనికి కారణమని అంటున్నారు.
ఎముకల ఆరోగ్యానికి మద్యం కూడా శత్రువుగా చెప్పొచ్చు. నిత్యం ఆల్కహాల్ తీసుకునే వారిలోర ఎముక ద్రవ్యరాశి తగ్గి, ఎముకలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వీటితో పాటు స్మోకింగ్ చేసే వారిలో కూడా ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి స్మోకింగ్‌కు పూర్తిగా దూరండా ఉండాలని సూచిస్తున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.