Business Ideas: బాక్స్ క్రికెట్.. ఇప్పుడిది ట్రెండీ బిజినెస్, లాభాలు ఎలా ఉంటాయంటే..
మారుతోన్న కాలంతో పాటు జీవన విధానంలోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు క్రికెట్ ఆడుకోవాలంటే పెద్ద పెద్ద గ్రౌండ్స్ అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పెరిగిపోవడమే ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా వెంచర్స్ చేయడంతో క్రికెట్ ఆడుకోవడానికి స్థలం కూడా లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది....

మారుతోన్న కాలంతో పాటు జీవన విధానంలోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు క్రికెట్ ఆడుకోవాలంటే పెద్ద పెద్ద గ్రౌండ్స్ అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పెరిగిపోవడమే ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా వెంచర్స్ చేయడంతో క్రికెట్ ఆడుకోవడానికి స్థలం కూడా లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించే ఆలోచనతో పుట్టిందే బాక్స్ క్రికెట్ బిజినెస్ ఐడియా. ఇంతకీ బాక్స్ క్రికెట్ అంటే ఏంటి.? ఈ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి.? ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం పట్టణాల్లో బాక్స్ క్రికెట్ ట్రెండ్ పెరుగుతోంది. రాత్రుళ్లు కూడా క్రికెట్ ఆడుకునే వెసులుబాటుతో ఈ బాక్స్ క్రికెట్ ఉపయోగపడుతుంది. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఈ బాక్స్ క్రికెట్‌లకు ఆకర్షితులవుతున్నారు. ఈ బిజినెస్‌ను ప్రారంభించాలంటే మీకు సొంత స్థలం ఉండాలి. ఆ స్థలంలో బాక్స్ క్రికెట్ కోర్టును నిర్మించాలి. చుట్టూ పోల్స్‌తో పాటు, నెట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే లైట్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి.
ఇక ఛార్జీల విషయానికొస్తే ప్రస్తుతం ఈ బాక్స్ క్రికెట్‌లలో గంటకు సుమారు రూ. 600 నుంచి రూ. 700 వరకు వసూలు చేస్తున్నారు. క్రికెట్ అనేది ఎక్కువ మంది కలిసి ఆడే గేమ్ కాబట్టి భారం కూడా తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక 20 మంది గేమ్ ఆడినట్లైతే ప్రతీ ఒక్కరికీ రూ. 30 చొప్పున పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. నగరం మధ్యలో ఉన్న బాక్స్ క్రికెట్‌లో అయితే ఈ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




