మీకూ నిద్రలో చెమట పడుతోందా? నిర్లక్ష్యం చేశారో..

May 03, 2024

TV9 Telugu

వాతావరణం వేడిగా ఉండటం వల్లనో, సరిగ్గా గాలి వీచకనో.. చెమటలు పట్టడం సర్వసాధారణం. అయితే కొంతమందికి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాత్రుళ్లు నిద్రలో విపరీతంగా చెమటలు పడుతుంటాయి

చిన్న సమస్యే కదా నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అసలింతకీ రాత్రుళ్లు ఉన్నట్లుండి చెమటలు ఎందుకు పడతాయో తెలుసుకుందాం

రాత్రుళ్లు నిద్రలో చెమటలు పడుతున్నాయంటే హైపర్‌ థైరాయిడిజం, ఒత్తిడి, ఆందోళన, మానసిక రుగ్మతలు, మెనోపాజ్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుంది

అలాగే టీబీ, హెచ్‌ఐవీ, లుకేమియా వంటి సమస్యలున్నప్పుడు కూడా ఉన్నట్లుండి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంటుంది. ఇది రాత్రుళ్లు చెమటకు దారి తీస్తుంది

యాంటీ డిప్రెసెంట్స్‌, యాంటీ రెట్రోవైరల్స్‌, హైపర్‌టెన్షన్‌ మందులు వాడడం వల్ల చెమట గ్రంథుల్ని నియంత్రించే మెదడు భాగాలపై ప్రతికూల ప్రభావం పడి, నిద్రలో చెమటలు పడుతుంటాయి

కెఫీన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు మితిమీరి తీసుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమటలు పట్టే అవకాశం ఎక్కువేనట. అయితే రాత్రి పూట నిద్రలో చెమటలు పట్టడమనేది తరచూ తలెత్తి మాత్రం వెంటనే వైద్య నిపుణుల్ని సంప్రదించాలి 

తద్వారా సమస్యేంటో తెలుసుకొని, సకాలంలో చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు

కెఫీన్‌, మసాలాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, చాక్లెట్‌లకు దూరంగా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడం, నిద్రించే ప్రదేశం చల్లగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు