మహారాష్ట్రలో కరోనా విళయ తాండవం.. ముంబైలో అయితే మరీ..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే ముప్పై ఏడువేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పది వేల మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ముఖ్యంగా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి అవుతున్నాయి. నిత్యం ఇక్కడ వందల కేసులు నమోదవుతుండటం.. రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 800 […]

మహారాష్ట్రలో కరోనా విళయ తాండవం.. ముంబైలో అయితే మరీ..
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 9:48 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే ముప్పై ఏడువేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పది వేల మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ముఖ్యంగా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి అవుతున్నాయి. నిత్యం ఇక్కడ వందల కేసులు నమోదవుతుండటం.. రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 800 కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. శనివారం మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా కేసుల తాజా వివరాలను విడుదల చేసింది. శనివారం ఒక్క రోజులో 790 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదైనట్లు పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 36 మంది ప్రాణాలను కోల్పోగా.. కరోనా బారినుంచి 121 మంది కోలుకుని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. వీటితో కలుపుకొని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు 521 రాష్ట్రంలో కరోనా బారినపడి ప్రాణాలు విడిచారని తెలిపింది. 2000 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.

కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. అత్యధికంగా ముంబైలోనే అవుతున్నాయి. తాజాగా నమోదైన 790 కరోనా కేసుల్లో.. ముంబైలోనే 547 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు శనివారం మరణించిన 36 మందిలో.. 27 మంది ముంబైలోనే మరణించినట్లు అధికారులు వెల్లడించారు.