ఇటలీ పరిస్థితి చూస్తే కన్నీరే.. శవపేటికలు లేవు.. ఖననానికి ప్లేస్ కూడా..
కరోనా.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రభావంతో.. ఇప్పటికే దాదాపు ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో రెండు లక్షల మంది వరకు దీనితో పోరాడుతున్నారు. ఇక ఈ మహమ్మారి చైనాలో ఎక్కువ మంది ప్రాణాలు తీసుకోగా.. ఆ తర్వాత రెండో స్థానంలో ఇటలీ ఉంది. కరోనా ప్రభావం చైనా తర్వాత.. ఇటలీపై భారీగా పడింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా బారిన పడిన పలువురు బాధితులు.. ఒంటరిగా […]
కరోనా.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రభావంతో.. ఇప్పటికే దాదాపు ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో రెండు లక్షల మంది వరకు దీనితో పోరాడుతున్నారు. ఇక ఈ మహమ్మారి చైనాలో ఎక్కువ మంది ప్రాణాలు తీసుకోగా.. ఆ తర్వాత రెండో స్థానంలో ఇటలీ ఉంది. కరోనా ప్రభావం చైనా తర్వాత.. ఇటలీపై భారీగా పడింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా బారిన పడిన పలువురు బాధితులు.. ఒంటరిగా జీవిస్తూ.. అలా ఏకాకిగానే ప్రాణాలు విడుస్తున్నారు. కనీసం అయినవారు కూడా.. అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారు. కరోనా భయంతో.. కొన్నేళ్లుగా వస్తున్న సామాజిక ఆచారాలు కూడా పక్కనపెట్టేయాల్సి వస్తోంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఇటలీలో కరోనా మరణాలు విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో మృతదేహాలకు అంత్యక్రియలు కూడా ఆలస్యమవుతున్నాయి.
బెర్గామో పట్టణంలోని ఓ ఆస్పత్రిలో కరోనా ఎఫెక్ట్‌తో ఓ 85 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచారు. అయితే అతని అంత్యక్రియు ఐదురోజులు గడిచినా కాలేదని.. అందుకు కారణం.. అక్కడి గ్రేవ్ యార్డ్స్ అన్నీ మూతపడ్డట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కనీసం శవపేటికలు కూడా అందుబాటులో లేవని.. మృతదేహాలకు ఆచారాల ప్రకారం ఖననం చేయాలనుకునే వారికి.. అక్కడి ప్రభుత్వ ఆంక్షలు అడ్డువచ్చి.. సంప్రదాయం ప్రకారం జరపలేకపోతున్నట్లు తెలుస్తోంది.
అంత్యక్రియలతో పాటు.. ఇతర ఏ కార్యక్రమాల్లో కూడా ప్రజలు గుంపులుగుంపులుగా ఉండటం నిషిద్ధమని ఇటలీ సర్కార్ హెచ్చరికలు జారీచేసింది. ఇదిలా ఉంటే.. ఫ్రాంకా అనే ఆమె మరణించింది. అయితే ఆమె కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. వారిని కరోనా అనుమానితులుగా భావించి.. ఏకాంతంలో ఉంచారు. దీంతో వారి ఇంటి పెద్ద అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి తలెత్తింది.