14 రోజులు హౌస్‌ అరెస్ట్‌లో కమెడియన్ ప్రియదర్శి

షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన ప్రియదర్శికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా స్క్రీనింగ్ చేశారు. అనంతరం ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14 రోజులు ప్రజలకు..

14 రోజులు హౌస్‌ అరెస్ట్‌లో కమెడియన్ ప్రియదర్శి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2020 | 5:04 PM

కరోనా ఎఫెక్ట్‌తో 14 రోజుల పాటు కమెడియన్ ప్రియదర్శి హౌస్ అరెస్ట్ కానున్నాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తూ.. ప్రజలను భయాందోళలనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ… కేంద్రంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా కరోనా వ్యాప్తి చెందకుండా.. స్కూల్స్, కాలేజీలు, థియేటర్లతో పాటు పలు షాపింగ్ మాల్స్ కూడా మూసివేసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని, పరిశుభ్రంగా ఉండాలని సూచనలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

అయితే వీటిని లెక్క చేయకుండా, పట్టించుకోకుండా జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు ప్రభాస్ అండ్ టీం. ఈ టీమ్‌లో ప్రభాస్‌తో పాటు కమెడియన్ ప్రియదర్శి కూడా ఉన్నాడు. కాగా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన ప్రియదర్శికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా స్క్రీనింగ్ చేశారు. అనంతరం ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14 రోజులు ప్రజలకు దూరంగా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపాడు ప్రియదర్శి. కాగా ప్రియదర్శి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Read More this also: 

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..

దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! 

ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి