AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్.. తెలుగు రాష్ట్రాల్లో ‘సామాజిక వ్యాప్తి’ కేసులు పెరుగుతున్నాయా..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత దేశంలో వైరస్ సోకిన కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.

కరోనా వైరస్.. తెలుగు రాష్ట్రాల్లో 'సామాజిక వ్యాప్తి' కేసులు పెరుగుతున్నాయా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 04, 2020 | 4:58 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత దేశంలో వైరస్ సోకిన కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇక దేశంలో కరోనా వైరస్ ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. అంతేకాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సామాజిక వ్యాప్తి(కమ్యూనిటీ స్ప్రెడ్) మొదలైందని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సామాజిక వ్యాప్తి భయం పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో సామాజిక వ్యాప్తి ద్వారా వ్యాపించినవి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఏపీలో గుంటూరు, తూర్పు గోదావరి, కర్నూల్, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో.. ఇటు తెలంగాణలో సిద్దిపేట, సంగారెడ్డి, మంచిర్యాల, నల్గొండ, జగిత్యాల, మేడ్చల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సామాజిక వ్యాప్తి ద్వారా కరోనా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ రాగా, ఇటీవల కాలంలో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో సామాజిక వ్యాప్తి మొదలైనట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కరోనాపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ”ముంబయి, మహారాష్ట్ర, చెన్నైతో పాటు పలు రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు. అందరికీ కరోనా టెస్ట్‌లు చేస్తుండటం వలన పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల అసింప్టమాటిక్ లక్షణాలు కనిపించడం, క్వారంటైన్ రూల్స్‌ను సరిగా పాటించకపోవడం వలన వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ టెస్ట్‌లు జరుగుతున్నందు వలన ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి” అని అన్నారు.

Read This Story Also: బ్రేకింగ్: సీఎం జగన్ నివాస సమీపంలో కరోనా కలకలం.. ఇద్దరు వాలంటీర్లతో సహా..!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్