AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“దీపికా పదుకొనే”లాంటి అమ్మాయి కావాలి..

తనకు కాబోయే భార్య "దీపికా పదుకొనే"లా ఉండాలని సమాధానం చెప్పారు బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్. ఎందుకు అనేది కూడా వివరించారు....

దీపికా పదుకొనేలాంటి అమ్మాయి కావాలి..
Sanjay Kasula
|

Updated on: Jun 04, 2020 | 5:10 PM

Share

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమై సినీ ప్రముఖులు… సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటున్నారు. ఫోటోలు, వీడియోలు పోస్టు చేయటంతోపాటు లైవ్ చాటింగ్‌లతో సందడిగా గడిపేస్తున్నారు. అయితే కొందరు సమస్యల్లో ఇరుక్కుంటుంటే… మరికొందరు మాత్రం తెగ అల్లరి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ తన ఫ్యాన్స్‌తో లైవ్ షోలో ముచ్చటించారు. వారు అడిగిన కొంటే ప్రశ్నలకు.. సరదా సమాధానాలు ఇస్తూ ఫుల్ టు ఫుల్ మజా చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘మీ కాబోయే భార్య ఎలా ఉండాలి’ అని కార్తిక్‌ను ప్రశ్నించాడు. అందుకు అతను.. తనకు కాబోయే భార్య “దీపికా పదుకొనే”లా ఉండాలని సమాధానం చెప్పారు. ఎందుకు అనేది కూడా వివరించారు. దీపిక, తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌ను తెగ ముద్దు చేస్తారని… ఈ ప్రపంచంలో దీపికకు బాగా ముద్దు వచ్చే ముఖం రణ్‌వీర్‌దే… అందుకే దీపికలా ముద్దు చేసే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పారు ఈ యంగ్ హీరో.

View this post on Instagram

#DheemeDheemeChallenge has reached d next level ? @deepikapadukone ???? Too much fun ?

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on