బ్రేకింగ్: సీఎం జగన్ నివాస సమీపంలో కరోనా కలకలం.. ఇద్దరు వాలంటీర్లతో సహా..!

తాడేపల్లిలోని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాస సమీపంలో కరోనా కలకలం రేపింది. జగన్ నివాసానికి అతి చేరువలో ఉన్న ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేటలో

బ్రేకింగ్: సీఎం జగన్ నివాస సమీపంలో కరోనా కలకలం.. ఇద్దరు వాలంటీర్లతో సహా..!
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 4:05 PM

తాడేపల్లిలోని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాస సమీపంలో కరోనా కలకలం రేపింది. జగన్ నివాసానికి అతి చేరువలో ఉన్న ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేటలో ఈ రోజు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఇందులో ఇద్దరు వాలంటీర్లు కూడా ఉన్నారు.  దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటైజేషన్ పనులను చేస్తున్నారు. కాగా వాలంటీర్లు ఇద్దరు గత మూడు రెండు క్రితం తాడేపల్లిలో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. మరోవైపు వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారన్న వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు.

కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3373కు చేరుకోగా.. అందులో 2273 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1033 యాక్టివ్ కేసులు ఉండగా.. మరణించిన వారి సంఖ్య 71కు చేరింది.  ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో 119 మందికి కరోనా నిర్ధారణ కాగా.. నలుగురు కోలుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 616 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అందులో ప్రస్తుతం 372 మంది చికిత్స పొందుతున్నారు.

Read This Story Also: జగన్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం మామ సంచలన ఆరోపణలు..!