ఆన్‌లైన్ పరీక్షలు వద్దంటూ విద్యార్థుల ఆందోళన

పరీక్షలు నిర్వహించకుండానే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఆన్‌లైన్ పరీక్షలు వద్దంటూ విద్యార్థుల ఆందోళన
Jyothi Gadda

|

May 18, 2020 | 6:10 PM

కరోనా నేపథ్యంలో దేశంమొత్తం లాక్‌డౌన్ పాటిస్తోంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గానూ విద్య, వ్యాపార, రవాణా వంటి అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కూలీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యా సంవత్సరం మధ్యలోనే స్కూళ్లు, కాలేజీలు మూతపడటంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో 1-9వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించగా, ఉన్నత విద్యలో మాత్రం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ..పరీక్షలు నిర్వహిస్తామని ఆయా రాష్ట్రాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొందరు ఆన్ లైన్ పాఠాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా పరీక్షలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్ ద్వారా పోర్షన్లను పూర్తిచేయాలని, జూన్ మొదటి వారంలో పరీక్ష తేదీలను ప్రకటిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులు సన్నద్ధం కావాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ వైస్ చాన్స్‌లర్లు, ఇనిస్టిట్యూట్ల హెడ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆన్‌లైన్ వేధికగా తమ నిరసన వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహించకుండానే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున సంతకాలు చేపట్టారు.

అయితే, ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం పోర్షన్ పెండింగులో ఉందన్నారు. ఆన్‌లైన్‌లో చెబుతున్న పాఠాలు తమకు ఏమాత్రం అర్థం కావడం లేదని అన్నారు. నోట్స్ ఆన్‌లైన్‌లో పంపారని, దానిని తాము సొంతంగా చదివి అర్థం చేసుకోవటం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu