బస్సులకోసం వలస కార్మికుల నిరీక్షణ.. ఎంతెంత దూరం ?
అది మహారాష్ట్రలోని థానే బస్ స్టేషన్.. అక్కడ గంటలకొద్దీ సుమారు రెండు కిలోమీటర్ల దూరం మేరా నిలబడ్డారు వలస కార్మికులు. ఒక్కో బస్సులో జస్ట్ 22 మందిని మాత్రమే అనుమతిస్తున్నారని తెలిసినా తప్పలేదు. ఇలా పడిగాపులు పడుతున్న వారిలో రాత్రి 8, 9, 10 గంటల నుంచే లైన్ లో ఉన్నారట చాలామంది.. ఎంతసేపయినా వీరి ముందున్న కార్మికులు కదలక పోవడంతో వీరిలో సహనం నశిస్తోంది. కానీ మరేమీ చేయలేక దిగాలుగా తాము ఎప్పుడు కనీసం బస్సు […]

అది మహారాష్ట్రలోని థానే బస్ స్టేషన్.. అక్కడ గంటలకొద్దీ సుమారు రెండు కిలోమీటర్ల దూరం మేరా నిలబడ్డారు వలస కార్మికులు. ఒక్కో బస్సులో జస్ట్ 22 మందిని మాత్రమే అనుమతిస్తున్నారని తెలిసినా తప్పలేదు. ఇలా పడిగాపులు పడుతున్న వారిలో రాత్రి 8, 9, 10 గంటల నుంచే లైన్ లో ఉన్నారట చాలామంది.. ఎంతసేపయినా వీరి ముందున్న కార్మికులు కదలక పోవడంతో వీరిలో సహనం నశిస్తోంది. కానీ మరేమీ చేయలేక దిగాలుగా తాము ఎప్పుడు కనీసం బస్సు స్టేషన్ వరకైనా చేరుతామా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు బస్సు ఎక్కుతామో, ఎప్పుడు తమ గమ్యం చేరుతామో ఎవరికీ తెలియదు. అందరిలోనూ ఒకటే టెన్షన్.. నాలుగో దశ లాక్ డౌన్ ని ఈ నెల 31 వరకు పొడిగించడంతో.. అనేకమంది కాలినడకనే బయలుదేరడంతో.. పోలీసులు అడ్డగించి థానే బస్ స్టేషన్ కి తరలించారు. ఒక కష్టాన్ని అధిగమిద్దామనుకుంటే ఇలా మరో కష్టం వీరికి ఎదురైంది.



