మరో కోయంబేడులా గుంటూరు మార్కెట్..28 మందికి క‌రోనా

గుంటూరు కూరగాయల మార్కెట్‌ మరో కోయంబేడులా మారుతోంది. దీంతో ఇప్పటివరకు కరోనా కేసులు వెలుగు చూడని ప్రాంతాల్లో సైతం కొత్తగా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మార్కెట్‌లోని వ్యాపారులు, గుమస్తాలు, ముఠా కూలీలు

మరో కోయంబేడులా గుంటూరు మార్కెట్..28 మందికి క‌రోనా
Follow us

|

Updated on: Jun 03, 2020 | 5:10 PM

గుంటూరు కూరగాయల మార్కెట్‌ మరో కోయంబేడులా మారుతోంది. ఇక్కడ పనిచేసే 28మందికి కరోనా సోకింది. వారిలో గుంటూరు నగరమే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేవారూ ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసులు వెలుగు చూడని ప్రాంతాల్లో సైతం కొత్తగా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వారం క్రితం ఇద్దరు రిటైల్‌ వ్యాపారులు కరోనా బారిన పడ్డారు. వారి లింకుల ద్వారా హోల్‌సేల్‌ వ్యాపారులకు పరీక్షలు చేయించారు. వారిలో కొందరికి వైరస్‌ సోకడంతో మొత్తం మార్కెట్‌లోని వ్యాపారులు, గుమస్తాలు, ముఠా కూలీలు 266మందికి పరీక్షలు నిర్వహించగా 28మందికి పాజిటివ్‌ వచ్చింది. అనుమానిత లక్షణాలు కనపడగానే మార్కెట్‌ను మూసివేయించారు. పాజిటివ్‌ వచ్చినవారి కుటుంబ సభ్యులు, సంబంధీకులు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మ‌రో 180 మంది కి నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల ఫ‌లితాలు రావ‌ల‌సి ఉంది. ఇదిలా ఉంటే, మరోవైపు కూరగాయల మార్కెట్‌తో పాటు మిర్చి మార్కెట్ యార్డును కూడా మూసివేశారు. నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వచ్చే సోమవారం వరకూ అత్యధిక జనసామర్థ్యం ఉన్న మార్కెట్‌లలో కార్యకలాపాలు నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 180 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించిన హెల్త్ బులిటిన్ లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8066 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 180 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. వీరిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 101 మంది ఉన్నారు. ఇక రాష్ట్ర వాసులలో 79 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3971కి చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 68కి పెరిగింది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..