కరోనా విలయం: ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల కేసులు.. 2.3 లక్షల మరణాలు

కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 32 లక్షలు ఉన్న కేసులు ఒక్క రోజులోనే మరో లక్ష..

కరోనా విలయం: ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల కేసులు.. 2.3 లక్షల మరణాలు
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 8:54 AM

కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 32 లక్షలు ఉన్న కేసులు ఒక్క రోజులోనే మరో లక్ష దాటింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 33,04,381 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,33,839కి చేరింది. అయితే రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. ఇప్పటి దాకా 10,39,144 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే దాదాపు 20,31,398 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 60 వేలకు పైగా పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.

ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 30 వేల కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈ దేశంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలకి చేరింది. ఇక 63856 మంది కరోనాతో మరణించారు. ఓవరాల్‌గా చూస్తే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా, కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా మరోసారి వైరస్ ఛాయలు కనిపిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే.. ఇప్పటివరకూ 33,610 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 1,075 మంది ప్రాణాలు కోల్పోగా, 8373 మంది డిశ్చార్జి అయ్యారు.

Read More: 

వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌