దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..

రైళ్లు మళ్లీ కూతపెడుతున్నాయి. స్పెషల్ ట్రైన్స్ పట్టాలెక్కాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు 70 రోజులు జంక్షన్‌లకే పరిమితమైన రైళ్లు.. ఇప్పుడు పరుగు పెట్టబోతున్నాయి. లాక్‌డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 200 రైళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకూ 30 శ్రామిక్ రైళ్లను మాత్రమే నడిపించిన కేంద్ర ప్రభుత్వం..

దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2020 | 10:03 AM

రైళ్లు మళ్లీ కూతపెడుతున్నాయి. స్పెషల్ ట్రైన్స్ పట్టాలెక్కాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు 70 రోజులు జంక్షన్‌లకే పరిమితమైన రైళ్లు.. ఇప్పుడు పరుగు పెట్టబోతున్నాయి. లాక్‌డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 200 రైళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకూ 30 శ్రామిక్ రైళ్లను మాత్రమే నడిపించిన కేంద్ర ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి అదనంగా 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలాగే వీటికి 4 నెలల్లో రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. దీంతో ఈ నాలుగు నెలల్లో రైళ్లలో ప్రయాణం చేయాలనుకునేవారు.. ఇప్పటి నుంచే రిజర్వేషన్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నవారిని మాత్రమే రైల్వేస్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు అధికారులు.

ఇవీ న్యూ రూల్స్:

-ఈ కొత్త రైళ్లు ఎక్కువగా రాకపోకలు సాగించవు -వీటిలో విజయవాడ మీదుగా 14 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి -ప్రస్తుతం విజయవాడ నుంచి ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, బెంగుళూరు, చెన్నైకి వెళ్తున్నాయి -ప్రయాణానికి గంటన్నర ముందే స్టేషన్‌కి చేరుకోవాలి -లగేజీకి శానిటైజ్, వ్యక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు -ఆరోగ్య సేతు యాప్‌ చెక్ చేసి.. లో రిస్క్ ఉందంటేనే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. -తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలాగే భౌతిక దూరం పాటించాలి -అన్ని స్టేషన్లలోనూ క్యాటరింగ్, వెండింగ్ యూనిట్లు తెరిచే ఉంటాయి -ప్రస్తుతం జనరల్ కోచ్‌లలో కూడా రిజర్వ్‌డ్ సీట్లే ఉంటాయి -అన్ని రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ సీట్లు ఉంటాయి

కాగా ప్రయాణికులు గమ్యస్థానం చేరుకున్నతర్వాత అక్కడి ప్రభుత్వాలు చెప్పిన రూల్స్ తప్పకుండా పాటించాలి. క్వారంటైన్ నిబంధనలు ఆయా ప్రభుత్వాల రూల్స్ ప్రకారం ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి:

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

‘ఆ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా’.. బిగ్‌బాస్ నందినీ సంచలన కామెంట్స్