వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 104 లక్షలు.. 5.08 లక్షల మరణాలు..
ప్రపంచవ్యాప్తంగా 10,414,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 508,265 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 5,669,923 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10,414,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 508,265 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 5,669,923 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 3415 కరోనా మరణాలు సంభవించాయి. మరణాల రేటు కంటే రికవరీ రేటు పెరుగుతుండటంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది.
ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. అక్కడే అత్యధిక కేసులు(2,681,811), మరణాలు(128,783) సంభవించాయి. బ్రెజిల్, రష్యా, భారత్, బ్రిటన్, స్పెయిన్‌లలో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తుండటంతో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో అయితే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అవుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక అగ్రరాజ్యం తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు బ్రెజిల్‌లో నమోదయ్యాయి. అక్కడ 1,370,488 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 58,385 మంది వైరస్‌తో మరణించారు. ఆ తర్వాత రష్యాలో 6,41,156 పాజిటివ్ కేసులు, 9,166 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 568,315 నమోదు కాగా, మృతుల సంఖ్య 16,917కి చేరింది.