ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కోరలు చాస్తూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 704 కేసులు నమోదు కాగా.. అందులో ఏపీకి చెందిన వారు 648 మంది ఉన్నారు. 258 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కోవిడ్‌తో ఏడుగురు చనిపోయారు. అందులో కృష్ణా జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. కర్నూలుకు చెందిన వారు ఇద్దరు, గుంటూరు, అనంతపురంకు చెందిన వారు ఒక్కొక్కరుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో […]

ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే..?
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2020 | 1:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కోరలు చాస్తూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 704 కేసులు నమోదు కాగా.. అందులో ఏపీకి చెందిన వారు 648 మంది ఉన్నారు. 258 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కోవిడ్‌తో ఏడుగురు చనిపోయారు. అందులో కృష్ణా జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. కర్నూలుకు చెందిన వారు ఇద్దరు, గుంటూరు, అనంతపురంకు చెందిన వారు ఒక్కొక్కరుగా ఉన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి పాజిటివ్‌గా తేలగా… వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి కరోనా సోకింది. ఇప్పటి వరకు ఏపీలో 8 లక్షల 90వేల 190 మందికి టెస్టులు చేశారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లతో పాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 7897 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 187 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read: బ్రేకింగ్: చైనాలో మరో కొత్త వైరస్.. మానవజాతికి మరో డేంజర్..