లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో శానిటరీ నాప్కిన్ల తీవ్ర కొరత

మార్చి 25న భారత్‌లో మొట్టమొదట దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు సమస్య మొదలైంది. అయితే, ప్రజలకు అవసరమైన వస్తువుల జాబితాలో శానిటరీ నాప్కిన్లు చేర్చలేదు. దీంతో..

లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో శానిటరీ నాప్కిన్ల తీవ్ర కొరత
Follow us

|

Updated on: May 22, 2020 | 5:30 PM

కరోనా భూతం ప్రపంచ దేశాలపై పడి విలయ తాండవం చేస్తోంది. కంటికి కనిపించని వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. వైరస్ ధాటికి అగ్రరాజ్యాలు సైతం అల్లాడిపోతున్నాయి. అందులో భారత్ కూడా కరోనా కోరల్లో చిక్కుకున్ని కొట్టుమిట్టాడుతోంది. మందులేని మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా భారతీయ మహిళలు, అమ్మాయిలకు కూడా సమస్యలు తప్పటం లేదు. వారికి అవసరమైన శానిటరీ నాప్కిన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

దేశంలోని రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్‌, ఢిల్లీ, వంటి రాష్ట్రాల్లో శానిటరీ నాప్కిన్ల సమస్య తీవ్రంగా ఉంది. రాజస్థాన్‌ బాలికలు దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ కూడా రాసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఝార్ఖండ్‌లో బాలికలు పలు స్వచ్ఛంద సంస్థలకు ఫోన్లు చేసి తమకు సాయం చేయాలని కోరుతున్నారు. కరోనాకి ముందు వరకు ఈ బాలికలకు తమ స్కూళ్లలో ప్రతి నెలా శానిటరీ ప్యాడ్స్ అందజేసేవారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు మూతపడటంతో అక్కడి బాలికలకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రస్తుతం కొన్ని సచ్ఛంద సంస్థలు ఈ బాలికలకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ అందరికీ సరిపడ అందించలేక పోతున్నాయి. నెలసరి, శానిటరీ ప్యాడ్స్ గురించి మహిళలే బాహాటంగా చెప్పుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఈ బాలికలు శానిటరీ ప్యాడ్స్ తీసుకురమ్మని ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాలంటే ఒక పెద్ద సవాలులా భావిస్తున్నారు. అంతే కాదు, వారు తమ సమస్య గురించి గట్టిగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు.

మార్చి 25న భారత్‌లో మొట్టమొదట దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు సమస్య మొదలైంది. అయితే, ప్రజలకు అవసరమైన వస్తువుల జాబితాలో శానిటరీ నాప్కిన్లు చేర్చలేదు. దీంతో వాటిని గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉత్పత్రి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. మార్చి 29న రసాయన శాస్త్రవేత్తలు, కిరాణా దుకాణదారులు, ఆన్‌లైన్ సైట్ల ద్వారా ప్యాడ్‌లు అయిపోతున్నాయని వచ్చిన నివేధికల తర్వాత ప్రభుత్వం అవసరమైన వస్తువుల జాబితాలో వీటిని చేర్చింది. దాంతో పరిశ్రమలు తిరిగి తెరుచుకుని, ఉత్పత్తి ప్రారంభించే సరికి మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టింది. ఫ్యాక్టరీలకు అనుమతులు, కార్మికులకు కావాల్సిన పాసులు అన్ని సమకూర్చుకుని సప్లై చేసేసరికి ఆలస్యం జరిగిపోయిందని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేవలం 60శాతం మాత్రమే తెరుచుకున్న కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవటం కారణంగా దేశంలో శానిటరీ న్యాప్‌కిన్‌ల కొరత తలెత్తిందని చెబుతున్నారు.