AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్తగా 50 వేల నియామకాలు!

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చాలా కంపెనీలు వరుసపెట్టి ఉద్యోగులను

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్తగా 50 వేల నియామకాలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 22, 2020 | 5:49 PM

Share

Amazon India: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చాలా కంపెనీలు వరుసపెట్టి ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఆ కంపెనీ మాత్రం ఉద్యోగులను నియమించుకుంటామని పేర్కొంది. అది కూడా వందల్లో కాదు ఏకంగా వేలల్లో నియామకాలు చేపడతామని ప్రకటించింది.

వివరాల్లోకెళితే.. ఆ కంపెనీ మరేదో కాదు.. అమెజాన్ ఇండియా. అవును ఈ ఆన్‌లైన్ ఈకామర్స్ దిగ్గజం తాజాగా 50 వేల మంది సీజనల్ ఉద్యోగులను నియమించుకుంటామని పేర్కొంది. డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, డెలివరీ నెట్‌వర్క్ వంటి వాటిల్లో కొత్తగా నియామకాలు ఉంటాయని అమెజాన్ ఇండియా తెలిపింది. పార్ట్‌టైమ్ జాబ్ చేయాలని భావించే వారు కూడా అప్లై చేసుకోవచ్చని వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సెనా తెలిపారు.

[svt-event date=”22/05/2020,5:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]