దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా తీవ్రత.. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కేసులు ఎన్నంటే…
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. కాగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 2,706 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. కాగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 2,706 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 69 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,92,250కు చేరింది, మొత్తం మరణాల సంఖ్య 9,643కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 4,622 డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 5,57,914 చేరింది. ప్రస్తుతం 24,693 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
