బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కి కరోనా పాజిటివ్..

ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతు రావుకు....

బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కి కరోనా పాజిటివ్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 21, 2020 | 8:50 AM

ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతు రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన అపోలో హాస్పిటల్‌లో చేరారు. దీంతో వీహెచ్ కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ పాజిటివ్ టెస్టులు నిర్వహించారు వైద్యులు. అలాగే గత రెండు మూడు రోజులుగా ఆయనతో ఎవరు ఇంటరాక్ట్ అయారో వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7072కి చేరింది. ఇందులో 3363 యాక్టివ్ కేసులు ఉండగా.. 3506 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు జిహెచ్ఎంసి పరిధిలో458, రంగారెడ్డి 50, మేడ్చల్ 6, మహబూబ్ నగర్ 3, ఖమ్మం 2, కరీంనగర్ 13, వరంగల్ అర్బన్ 1, వరంగల్ రూరల్ 2, జనగామ 10, ఆదిలాబాద్ 1 కేసులు నమోదయ్యాయి.