AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. భయాందోళనలో ప్రజలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 పాజిటివ్ కేసులు...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. భయాందోళనలో ప్రజలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2020 | 8:32 AM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7072కి చేరింది. ఇందులో 3363 యాక్టివ్ కేసులు ఉండగా.. 3506 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు జిహెచ్ఎంసి పరిధిలో458, రంగారెడ్డి 50, మేడ్చల్ 6, మహబూబ్ నగర్ 3, ఖమ్మం 2, కరీంనగర్ 13, వరంగల్ అర్బన్ 1, వరంగల్ రూరల్ 2, జనగామ 10, ఆదిలాబాద్ 1 కేసులు నమోదయ్యాయి.

ఇక ఏపీ విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 491 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,452కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 390 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 83 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో ఐదు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. అలాగే 4,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో తాజాగా 22,371 పరీక్షలు నిర్వహించగా.. అందులో 390 కొత్త కేసులు వచ్చాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6630కు చేరింది. వారిలో తాజాగా 138 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం డిశ్చార్జి సంఖ్య 3,203కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 3,316 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 18 మందికి కరోనా సోకగా.. వారికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 326కు చేరింది. అందులో 277 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 83 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1506కు చేరింది. వీరిలో 859 డిశ్చార్జి అవ్వగా.. 647 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ