విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు‌: హైకోర్టు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో లాక్‌డౌన్...

విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు‌: హైకోర్టు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 21, 2020 | 9:09 AM

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో లాక్‌డౌన్ కూడా విధించింది ప్రభుత్వం. ఇక శనివారం ఆంధ్రాలో కొత్తగా 491 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు అధికారులకు, సిబ్బందికి, ఉద్యోగులకు కీలక మర్గదర్శకాలు విడుదల చేసింది. కార్యాలయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదని హైకోర్టు రిజిస్ట్రర్ రాజశేఖర్ పలు సూచనలు చేశారు.

ఏపీ హైకోర్టు మార్గదర్శకాలు:

  1. హైకోర్టు అధికారులు, సిబ్బంది కేంద్ర కార్యాలయం విడిచి వెళ్లకూడదు. వెళితే తీవ్రంగా పరిగణిస్తాం
  2. అనుమతితో వేరే రాష్ట్రం వెళ్లినవారు విధుల్లోకి తిరిగి వచ్చే ముందు తక్షణం క్వారంటైన్‌కు వెళ్లాలి
  3. కోర్టు విధుల్ని ముగించుకున్న సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  4. హైకోర్టు ప్రవేశమార్గం దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్ చేయించుకొని మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతి
  5. అధికారిక పని ఉన్నప్పుడు తప్ప, హైకోర్టు వరండా, వివిధ విభాగాలు, భోజన సమయంలో ఒకచోట చేరడం నిషేధం
  6. సిబ్బంది అందరు గుర్తింపు కార్డులు ధరించాలి. పనివేళల్లో టీ, స్నాక్స్‌ కోసం సీటు విడిచి వెళ్లకూడదు
  7. కార్యాలయ పని, భోజన సమయంలో తప్ప, పని వేళల్లో సిబ్బంది ఎవరైనా సీటులో లేరని కనుగొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం
  8. ఏసీలను 24-30 డిగ్రీల ఉష్టోగ్రతలో పనిచేసేలా చూడాలి
  9. కంటెయిన్‌మెంట్‌ జోన్ల పరిధిలో నివసించే అధికారులు, సిబ్బంది రాతపూర్వకంగా నియంత్రణ అధికారికి ఆ వివరాలు సమర్పించాలి
  10. భౌతిక దూరాన్ని పాటిస్తూ పరిమిత సంఖ్యలో లిఫ్ట్‌ను వినియోగించాలి
  11. కోర్టు ప్రాంగణం, ఛాంబర్లు, కోర్టు హాళ్లు, విభాగాలు, సమావేశ మందిరాలు, మరుగుదొడ్లు, నీటి సరఫరా ప్రాంతాల్లో తరచు శానిటైజేషన్‌ చేయాలి
  12. హైకోర్టు ప్రాంగణంలో ఉమ్మివేయడం నిషేధం కరోనా లక్షణాలున్న సిబ్బంది వెంటనే తెలియజేయాలి, గోప్యత పాటిస్తే తీవ్రంగా పరిగణిస్తాం
  13. కోర్టు వరండాల్లో జనసమూహం ఎక్కువ ఉండటానికి వీల్లేదు
  14. కోర్టులోకి వచ్చే వరసలో ఒక్కొక్కరికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా నిలబడాలి.

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ