‘అది మానవ సహజం’.. వలస కార్మికుల తరలింపుపై మోదీ

'అది మానవ సహజం'.. వలస కార్మికుల తరలింపుపై మోదీ

వలస కార్మికుల తరలింపులో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. వారు సురక్షితంగా ఇంటికి వెళ్లేలా చూడాలని, ఎవరికైనా.. ఇంటికి వెళ్లాలని అనుకోవడం సహజమని వ్యాఖ్యానించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో మాట్లాడిన ఆయన.. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు. ఈ వైరస్ పై కేంద్రం జరిపే పోరుకు రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ నెల 17 న లాక్ […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

May 11, 2020 | 5:50 PM

వలస కార్మికుల తరలింపులో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. వారు సురక్షితంగా ఇంటికి వెళ్లేలా చూడాలని, ఎవరికైనా.. ఇంటికి వెళ్లాలని అనుకోవడం సహజమని వ్యాఖ్యానించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో మాట్లాడిన ఆయన.. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు. ఈ వైరస్ పై కేంద్రం జరిపే పోరుకు రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ నెల 17 న లాక్ డౌన్ ముగిసిన అనంతరం.. ఈ ఆంక్షలను పొడిగించాలా లేక దశల వారీగా ఎత్తివేయాలా అన్న దానిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఆయన తెలుసుకోగోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మళ్ళీ ఊతమివ్వవలసిన అవసరం ఉందని, ఇందుకు ప్రత్యేక ఎకనమిక్ ప్యాకేజీ కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu