ప్యాసింజర్ రైళ్ల పునరుధ్ధరణ వద్దు.. కేసీఆర్

ప్యాసింజర్ రైళ్లను పునరుధ్ధరించాలన్న ప్రతిపాదనను తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. రెడ్ జోన్లుగా ఉన్న మెట్రో నగరాల నుంచి రైళ్లలో వస్తున్న ప్రజల ద్వారా కరోనా వైరస్ మరింత వ్యాపించగలదన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్ఛే రైలు ప్రయాణికులను క్వారంటైన్ చేయడం సాధ్యమయ్యే పని కాదన్నారు.  రుణాలను రీషెడ్యూల్ చేయాలనీ, రుణ పరిమితిని పెంచాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన.. […]

  • Umakanth Rao
  • Publish Date - 7:13 pm, Mon, 11 May 20
ప్యాసింజర్ రైళ్ల పునరుధ్ధరణ వద్దు.. కేసీఆర్

ప్యాసింజర్ రైళ్లను పునరుధ్ధరించాలన్న ప్రతిపాదనను తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. రెడ్ జోన్లుగా ఉన్న మెట్రో నగరాల నుంచి రైళ్లలో వస్తున్న ప్రజల ద్వారా కరోనా వైరస్ మరింత వ్యాపించగలదన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్ఛే రైలు ప్రయాణికులను క్వారంటైన్ చేయడం సాధ్యమయ్యే పని కాదన్నారు.  రుణాలను రీషెడ్యూల్ చేయాలనీ, రుణ పరిమితిని పెంచాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన.. కరోనా చికిత్సకు అవసరమయ్యే వ్యాక్సీన్ ను అభివృధ్ది చేయడానికి హైదరాబాద్ లోని కంపెనీలు కృషి చేస్తున్నాయని, బహుశా జులై లేదా ఆగస్టుకు ఇది అందుబాటులోకి రావచ్ఛునని  అన్నారు.

అటు పంజాబ్. బీహార్ సీఎం లు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరారు. ఇక తమ రాష్ట్రానికి మరిన్ని ఆర్ టీ, పీసీఆర్ టెస్టింగ్ కిట్స్ ని సరఫరా చేయాలని  తమిళనాడు సీఎం పళనిస్వామి కోరారు.