పీపీఈ కిట్ తొలగించి క‌రోనా రోగికి చికిత్స చేసిన డాక్ట‌ర్..అంత సాహ‌సం ఎందుకంటే…

పీపీఈ కిట్ తొలగించి క‌రోనా రోగికి చికిత్స చేసిన డాక్ట‌ర్..అంత సాహ‌సం ఎందుకంటే...

డేంజ‌ర్ సిట్యువేష‌న్ లో ఉన్న కరోనా రోగిని రక్షించే క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ సీనియర్ డాక్ట‌ర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. రోగిని కాపాడే క్రమంలో తన పీపీఈ కిట్టును తొలగించారు. దీంతో ఆయనను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ డాక్ట‌ర్ పేరు జహీద్‌ అబ్దుల్‌ మజీద్‌. జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆయన నివ‌శిస్తున్నారు. క‌రోనా సోకిన‌ రోగి […]

Ram Naramaneni

|

May 11, 2020 | 5:25 PM

డేంజ‌ర్ సిట్యువేష‌న్ లో ఉన్న కరోనా రోగిని రక్షించే క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ సీనియర్ డాక్ట‌ర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. రోగిని కాపాడే క్రమంలో తన పీపీఈ కిట్టును తొలగించారు. దీంతో ఆయనను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ డాక్ట‌ర్ పేరు జహీద్‌ అబ్దుల్‌ మజీద్‌. జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆయన నివ‌శిస్తున్నారు. క‌రోనా సోకిన‌ రోగి అంబులెన్స్‌లో ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌లోని ఐసీయూకు తీసుకెళ్లే బాధ్యతను ఆయనకు అప్పగించారు. అయితే స‌దరు రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ప‌డటాన్ని గుర్తించిన మ‌జీద్. అందుకు కార‌ణం శ్వాస కోసం రోగి గొంతులోకి వేసిన గొట్టం పొరపాటున ఊడిపోయినట్లు ఆయన గమనించారు. దాన్ని తిరిగి కావాల్సిన ప్లేసులో పెట్టేందుకు ఈ డాక్ట‌ర్ ప్రయత్నించారు.

అయితే అంబులెన్స్‌ లోపల వెలుతురు సరిగ్గా లేదు. అందునా పీపీఈ కిట్టు, క‌ళ్ల‌జోడు ధ‌రించ‌డం వ‌ల్ల లోప‌ల ఏమి స‌రిగ్గా క‌నిపించ‌డం లేదు. ఆల‌స్యం చేస్తే రోగి చనిపోయే ప్రమాదం ఉన్నందువల్ల అతడిని రక్షించడానికి కళ్లద్దాలు, ముఖ కవచాన్ని తొలగించి, అతడికి ట్యూబ్‌ను అమర్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో రోగి నుంచి వైరస్‌ అంటుకునే ప్రమాదం ఉన్నప్పటికీ ఆయన ఏ మాత్రం సంకోచించలేదని ఎయిమ్స్‌ రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. దేశం మొత్తం క‌రోనాతో పోరాడుతోందని, దీనిపై అందరూ సహకరించాలని కోరారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu