‘మహా’లో లాక్ డౌన్ ఉల్లంఘన.. భారీగా కేసులు నమోదు..

ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న

'మహా'లో లాక్ డౌన్ ఉల్లంఘన.. భారీగా కేసులు నమోదు..
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 5:30 PM

Lockdown violation: ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై మహారాష్ట్ర పోలీసులు భారీ సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,03,345 కేసులను పోలీసులు నమోదు చేశారు. వీరిలో 19,630 మందిని అరెస్ట్ చేశారు. ఇల్లీగల్ ట్రాన్స్ పోర్ట్ కింద 1,291 కేసులను నమోదు చేశారు.

మరోవైపు.. కరోనా లాక్ డౌన్ వేళ ట్రాఫిక్ రూల్స్ ను అధిగమించినందుకు మహారాష్ట్ర పోలీసులు 55,784 వాహనాలను సీజ్ చేశారు. దాదాపు రూ. 4 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేశారు. మరోవైపు రాష్ట్ర పోలీసుల్లో 887 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22 వేలు దాటింది. 832 మంది మృతి చెందారు.