విశాఖ: స్టెరైన్ తరలింపు ప్రారంభం

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ప్రభావిత గ్రామాలలో జీవీఎంసీ సిబ్బంది శానిటేషన్ చేస్తున్నారు. ఇందు కోసం...ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్టెరైన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.

విశాఖ: స్టెరైన్ తరలింపు ప్రారంభం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 11, 2020 | 2:54 PM

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్టెరైన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయాన్ని విశాఖ కలెక్టర్ జగన్ కు తెలిపారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జగన్ ఎల్జీ పాలిమర్స్ లీకేజీ సంభవించిన ట్యాంకులో ఉష్ణోగ్రతల వివరాలను అడిగారు. దానికి కలెక్టర్ ప్రస్తుతం లీకేజీ సంభవించిన ట్యాంకులో ఉష్ణోగ్రత 73 డిగ్రీల సెటీగ్రేడ్ ఉందని పేర్కొన్నారు. ట్యాంకులోని స్టెరైన్ కూడా వందశాతం పాలిమరైజ్ అయ్యిందని వెల్లడించారు. మరో ఐదు ట్యాంకుల్లో 13 వేల టన్నుల స్టెరెన్ ఉందనీ, దానిని సీఎం ఆదేశాల మేరకు కొరియాకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ప్రభావిత  గ్రామాలలో జీవీఎంసీ సిబ్బంది శానిటేషన్ చేస్తున్నారు. ఇందు కోసం దాదాపు ఐదు వందల మంది జీవీఎంసీ సిబ్బంది, అధికారులు వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఎండిన చెట్లు తొలగిస్తూ, రోడ్లను శుభ్రం చేస్తున్నారు. అలాగే గ్రామంలోనికి వాటర్ ట్యాంకర్లను తరలించారు.

మ‌రోవైపు, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు నెమ్మదిగా  కొలుకుంటున్నారు. ఇప్పటికీ 251 మంది కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. మరో పది మంది వివిధ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు. కాగా సీఎం జగన్ ప్రకటించిన మేరకు బాధితులకు ఈ రోజు నష్టపరిహారం అంద‌జేసే ప్ర‌క్రియ మొద‌లైంది. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు మంత్రులు చెక్కుల పంపిణీ చేప‌ట్టారు.